వ్యాక్సినేషన్ డ్రైవ్ మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ వారు సర్వే చెయ్యు విధానం

 💥 *వ్యాక్సినేషన్ డ్రైవ్ మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ వారు సర్వే చెయ్యు విధానం :*




రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరి వ్యాక్సినేషన్ స్థితి ని తెలుసుకోవడానికి గ్రామ వార్డు వాలంటీర్ వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనే మొబైల్ అప్లికేషన్లను కొత్తగా ఇవ్వటం జరిగింది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.

👉వ్యాక్సినేషన్ డ్రైవ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.0 లింక్ : Click 

పై అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది అందులో యువర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వద్ద vd+ వాలంటీర్ వారి క్లస్టర్ ఐడి ను ఎంటర్ చెయ్యాలి. వాలంటీర్ వారి క్లస్టర్ ఐడి అనగా వారి సచివాలయం కోడ్ + వారి క్లస్టర్ నెంబర్ అంటే సచివాలయం కోడ్ 10199103 అయితే వారి క్లస్టర్ 5 అయితే క్లస్టర్ కోడ్ అనేది 10199103005 అవుతుంది. అప్పుడు అప్లికేషన్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ vd10199103005 అవుతుంది. యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ రెండు ఒకటే. రెండిటినీ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చెయ్యాలి.


 తరువాత వాలంటీర్ వద్ద ఉన్నటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి GET OTP పై క్లిక్ చెయ్యాలి. వచ్చిన ఓటీపీ ను Enter OTP వద్ద ఎంటర్ చేసి, Old Password వద్ద ముందుగా ఎంటర్ చేసిన పాస్వర్డ్ అంటే vd మొదలు అయ్యే ది ఎంటర్ చెయ్యాలి. New Password మరియు Confirm Password దగ్గర కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన పాస్వర్డ్ ను ఒక చోట నోట్ చేసుకోండి. తర్వాత చేంజ్ పాస్వర్డ్ పై ఎంటర్ చేయాలి.


Password successfully changed login with a new password అని చూపిస్తుంది. అప్పుడు యూజర్ నేమ్ దగ్గర vd తో మొదలైన నెంబర్ను ఎంటర్ చేసి పాస్వర్డ్ దగ్గర కొత్తగా పెట్టినటువంటి పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చెయ్యాలి. హోమ్ ట్యాబు లో వ్యాక్సినేషన్ డ్రైవ్ అని చూపిస్తుంది దాని పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు వారి పరిధి లో ఉన్నటువంటి అందరి వివరాలు కుటుంబాల వారీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి చూపిస్తాయి. కుటుంబంలో అక్కడ చూపిస్తున్న టువంటి ఒకరి పేరు పై క్లిక్ చెయ్యాలి అప్పుడు వారి కుటుంబం లో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల వివరాలు చూపిస్తోంది ఒకవేళ వారి కుటుంబం లో మిగతా వారి వివరాలు చూపించినట్టు అయితే యాడ్ మెంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వారి కుటుంబంలో వారిని ఆడ్ చేయాలి.


తరువాత వ్యక్తి పేరు మీద క్లిక్ చేస్తే అక్కడ మూడు ఆప్షన్లు చూపిస్తుంది 1.VACCINATION NOT AT DONE అంటే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకొని వారు అని అర్థం .2.ONLY FIRST DOSE DOSE COMPLETED అంటే కేవలం ఫస్ట్ డోస్ మాత్రమే వేసుకున్నారని అర్థం దానిపై క్లిక్ చేస్తే ఎప్పుడు వేసుకున్నారో ఆ డేట్ అనేది ఎంటర్ చేయాలి. 3.TWO DOSES COMPLETED అనగా రెండు డోస్   పూర్తి అయ్యింది అని అర్థం. పై మూడింటిలో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి. ఈ విధంగా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ సర్వే చేయాలి.


వ్యాక్సినేషన్ తేదీని తెలుసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి వ్యాక్సినేషన్ టైంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి get otp పై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ కు వచ్చినటువంటి ఓటీపీ ను ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్ పై రిజిస్ట్రేషన్ అయినటువంటి అందరి వివరాలు వస్తాయి. అక్కడ ఫస్ట్ డోసు మరియు సెకండ్ డోసు వివరాలు చూపిస్తుంది.వాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.  

https://selfregistration.cowin.gov.in/


 ఒకవేళ పాస్వర్డ్ మార్చాలి అనుకుంటే హోం పేజీలో ఎడమవైపు మూడు లైన్లు పై క్లిక్ చేసి చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పాస్వర్డ్ ను మార్చుకునే అవకాశం కలదు 


వాక్సినేషన్ డ్రైవ్ సర్వే రిజిస్ట్రేషన్ సమయం లో పై సమస్య వస్తునట్టు అయితే "Change Password" ను అలా క్లిక్ చేస్తూ ఉండటం వలన ఓపెన్ అవుతుంది. Password Changed Successful అవుతుంది.


👉సర్వే చేయు విధానం యూజర్ మాన్యువల్ click here



Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2